BAN vs IND | నిరాశ పరిచిన రాహుల్, పూజారా.. నైట్‌వాచ్‌మెన్‌గా అక్షర్ పటేల్.. భారత్ 24/2
7వ ఓవర్ తొలి బంతికి పూజారా స్టంప్ అవుట్
BAN vs IND : రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కష్టాల్లో పడింది. వాల్ పూజారా 6 పరుగులకే రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మెహిదీ హసన్ మిరాజ్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి పూజారా స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో, అక్షర్ పటేల్ నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు రెండో ఓవర్లోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. షకిబుల్ హసన్ బౌలింగ్‌లో నురుల్ హసన్ క్యాచ్ పట్టడంతో రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. ఇంకా 13 ఓవర్ల ఆట మిగిలి ఉంది. దాంతో, అక్షర్ (9) , శుభ్‌మన్ గిల్ (7) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ 121 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 రన్స్‌కే పరిమితమైంది. దాంతో 144 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్‌కు 145 పరుగుల టార్గెట్ విధించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీశాడు. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ జకిర్ హసన్ (51), లిట్టన్ దాస్‌లు (73) హాఫ్ సెంచరీతో రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

