దుబాయ్: అఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఐఎల్టీ20లో షార్జా వారియర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా నవీన్‌ను 20 నెలల పాటు నిషేధం విధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. టోర్నీ తొలి సీజన్లో షార్జాతో కాంట్రాక్టు కుదుర్చుకున్న నవీన్..రెండో సీజన్లో కొనసాగేందుకు మొగ్గుచూపలేదు. ఈ కారణంగా లీగ్ నిర్వాహకులను సంప్రదించడంతో నవీన్‌పై చర్యలకు ఉపక్రమించారు.