మన షట్లర్లకు అన్యాయం

హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో ఒలింపిక్స్ అర్హత విషయంలో తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, సిక్కిరెడ్డి, శ్రీకాంత్‌కు అన్యాయం జరిగిందని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కరోనా ప్రభావంతో అర్హత టోర్నీలు రద్దయిన కారణంగా వారు ఒలింపిక్స్‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని, అందువల్ల వారికి మరో అవకాశం కల్పించేలా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, భారత ఒలింపిక్ సంఘం, భారత బ్యాడ్మింటన్ సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. కాగా విశ్వక్రీడల అర్హత టోర్నీలైన ఇండియన్, సింగపూర్ , ఇండోనేషియన్ ఓపెన్ రద్దు కావడంతో శ్రీకాంత్, సైనా,సిక్కిరెడ్డి, పొన్నప్పకు ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకునే అవకాశం రాలేదు. దీంతో టోక్యోలో పాల్గొనే చాన్స్ కోల్పోయారు. యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు జరుగగా.. ఆసియా పరిధిలో టోర్నీలు రద్దవడంతో మన షట్లర్లకు చుక్కెదురైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

