Babar Azam | బాబర్ నయా చరిత్ర.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తొలి క్రికెటర్‌గా రికార్డు
Babar Azam | ఇటీవలే మొదలైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తూ సారథిగా వ్యవహరిస్తున్న పెషావర్ జల్మీ తరఫున తొలి మ్యాచ్ ఆడిన బాబర్..
Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి బాబర్ ఆజమ్ మరో అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఇటీవలే మొదలైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తూ సారథిగా వ్యవహరిస్తున్న పెషావర్ జల్మీ తరఫున తొలి మ్యాచ్ ఆడిన బాబర్.. ఈ లీగ్‌లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 68 పరుగులు చేసిన బాబర్.. ఈ ఘనత అందుకున్నాడు. అయితే బాబర్ బాదినా అతడి జట్టు మాత్రం ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌కు ముందు పీఎస్ఎల్లో బాబర్.. 3 వేల పరుగులు చేరడానికి 65 పరుగుల దూరంలో నిలిచాడు. అయితే క్వెట్టాతో మ్యాచ్‌లో బాబర్ వేగంగా ఆడి 42 బంతుల్లో 4 బౌండరీలు, 4 భారీ సిక్సర్ల సాయంతో 68 రన్స్ సాధిచండంతో అతడు 3 వేల పరుగుల (78 ఇన్నింగ్స్) మైలురాయిని దాటాడు. పీఎస్ఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో బాబర్ తర్వాత.. ఫకర్ జమాన్ (77 ఇన్నింగ్స్‌లలో 2,381 రన్స్), షోయభ్ మాలిక్ (78 ఇన్నింగ్స్‌లలో 2,135) , మహ్మద్ రిజ్వాన్ (61 ఇన్నింగ్స్‌లలో 2007)లు తదుపరి స్థానాలలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బాబర్ మరో ఆరు పరుగులు చేసుంటే టీ20 పార్మాట్లో అతడు చేసిన పరుగులు 10 వేలు దాటేవి. పాకిస్తాన్ నుంచి షోయభ్ మాలిక్ ఒక్కడే ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా ఉన్నాడు.
𝐔𝐍𝐏𝐀𝐑𝐀𝐋𝐋𝐄𝐋𝐄𝐃 👑
First batter to score 3️⃣0️⃣0️⃣0️⃣ runs in HBL PSL 🥇#HBLPSL9 | #KhulKeKhel | #QGvPZ pic.twitter.com/SHd7F2VzSp
— PakistanSuperLeague (@thePSLt20) February 18, 2024
బాబర్ దంచికొట్టినా పెషావర్ జల్మీ మాత్రం ఓటమితో టోర్నీని ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన క్వెట్టా.. జేసన్ రాయ్ (48 బంతుల్లో 75, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సౌద్ షకీల్ (47 బంతుల్లో 74, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు 157 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నమోదుచేశారు. ఈ ఇద్దరి విజృంభణతో క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 206 రన్స్ చేసింది. అనంతరం ఛేదనలో పెషావర్ కూడా దంచికొట్టింది. ఓపెనర్లు సయీమ్ అయూబ్ (26 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (42 బంతుల్లో 68, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలోనే 91 పరుగులు జతచేశారు. కానీ ఈ ఇద్దరూ ఔటయ్యాక ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ గాడితప్పింది. 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో క్వెట్టా.. 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

