Ayush Shetty : బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. అదిరే ఆటతో ఫైనల్ చేరిన ఆయుష్ స్వర్ణానికి బదులు రజతంతోనే సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో భారత కుర్రాడి జైత్రయాత్రకు చైనా ఆటగాడు షీ యూ కీ (Shi Yu Qi) చెక్ పెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన షీ వరస సెట్లలో జోరు చూపించి విజేతగా నిలిచాడు.
చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ఆయుష్ శెట్టి సిల్వర్ మెడల్ సాధించాడు. సెమీస్‌లో టాప్ సీడ్‌ను ఓడించిన ఈ కుర్రాడు ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. వరస సెట్లలో షీ యూ కీ(చైనా) జోరు ముందు తలవంచిన ఆయుశ్ మ్యాచ్‌ను అప్పగించేశాడు.
Rising to the top! 🚀
Ayush Shetty clinches the Silver Medal at the Badminton Asia Championships 2026. What a stellar performance throughout the tournament! Proud of you, Champ! 🇮🇳🥈 pic.twitter.com/8fgyKFjr3A
— BAI Media (@BAI_Media) April 12, 2026
తొలి సెట్‌ను 8-21తో కోల్పోయిన భారత షట్లర్ రెండో సెట్లోనూ పుంజుకోలేదు. 21-10తో గెలుపొందిన షీ పసిడి పతకాన్ని ఎగరేసుకుపోయాడు. 61 ఏళ్ల తర్వాత ఈ లీగ్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆడిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కిన ఆయుష్ రజతంతో సగర్వంగా స్వదేశానికి రానున్నాడు.