AUSvsWI 1st Test: విండీస్ 188 ఆలౌట్.. ఓపెనర్‌గా ఫస్ట్ మ్యాచ్‌లోనే విఫలమైన స్మిత్.. తొలి రోజు ఆసీస్‌దే ఆధిక్యం
AUSvsWI 1st Test: అడిలైడ్ ఓవల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ కూడా స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
AUSvsWI 1st Test: స్వదేశంలో ఇటీవలే పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా.. తాజాగా వెస్టిండీస్‌పైనా జోరు కొనసాగిస్తోంది. అడిలైడ్ ఓవల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌ను 62.1 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూల్చింది. ఆసీస్ బౌలర్లలో సారథి పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్లు తలా నాలుగు వికెట్లతో చెలరేగారు. విండీస్ జట్టులో క్రిక్ మెకంజీ (50) ఒక్కడే అర్థ సెంచరీతో రాణించాడు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన స్టీవ్ స్మిత్.. ఆకట్టుకోలేదు.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్.. ఆసీస్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కమిన్స్ వేసిన పదో ఓవర్లో ఆ జట్టు ఓపెనర్ చందర్‌పాల్ (6) వికెట్‌ను కోల్పోయింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా వికెట్లను నష్టపోయింది. టాపార్డర్, మిడిలార్డర్లలో మెకంజీ మినహా ఏ ఒక్కరూ 20 పరుగులు కూడా చేయలేకపోయాయరు. ఆఖరి వరుస బ్యాటర్ షెమర్ జోసెఫ్.. 41 బంతుల్లో 36 పరుగులు చేయడంతో విండీస్.. 188 పరుగులకు ఆలౌట్ అయింది.
West Indies debutant Shamar Joseph makes a big first impression by claiming the wickets of Steve Smith and Marnus Labuschagne 👀
Scorecard: https://t.co/CHrgi2NLyG#AUSvWI | #WTC25 pic.twitter.com/LPSwIK3IEb
— ICC (@ICC) January 17, 2024
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. 25 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. వార్నర్ పొజిషన్‌ను భర్తీ చేస్తున్న స్మిత్.. కొత్త కుర్రాడు సెమర్ జోసెఫ్ వేసిన తొలి ఓవర్ (ఆసీస్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్)లో మొదటి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. షెమర్ కు ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం. అనంతరం షెమర్.. లబూషేన్ (10)నూ ఔట్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 21 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా (30 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (6)లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

