AUSvsPAK 1st Test: ఆసీస్ భారీ స్కోరు.. ధీటుగా బదులిస్తున్న పాకిస్తాన్..
AUSvsPAK 1st Test: రెండో రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్తాన్.. 53 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్, ఖుర్రమ్ షాజాద్ లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా...
AUSvsPAK 1st Test: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ తొలి టెస్టులో భాగంగా బౌలింగ్‌లో విఫలమైనా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ధీటుగా బదులిస్తోంది. ఆసీస్ పేస్ త్రయం మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్‌లను తట్టుకుని ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును కరిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్తాన్.. 53 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్.. 113.2 ఓవర్లలో 487 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న పాక్ ఆల్ రౌండర్ అమీర్ జమాల్.. ఆరు వికెట్లతో అదరగొట్టాడు.
పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆసీస్.. డేవిడ్ వార్నర్ (164) తో పాటు మిచెల్ మార్ష్ (107 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (42), ఇమామ్ ఉల్ హక్ (38 బ్యాటింగ్) లు తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. 36 ఓవర్ల పాటు ఆడి 74 పరుగులు జోడించిన ఈ జోడీని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ విడదీశాడు.
షఫీక్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్ (43 బంతుల్లో 30, 5 ఫోర్లు) వేగంగా ఆడాడు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ 49 పరుగులు జోడించారు. అయితే ఆట మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనగా.. స్టార్క్ వేసిన 50వ ఓవర్లో మూడో బంతికి మసూద్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్తాన్.. 53 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్, ఖుర్రమ్ షాజాద్ (7 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 355 పరుగులు వెనుకబడి ఉంది. బాబర్ ఆజమ్‌తో పాటు సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్, అగా సల్మాన్, ఫహీమ్ అష్రఫ్‌లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

