Tokyo Olympics: కండోమ్ వాడి.. గోల్డ్ మెడల్ కొట్టింది.. వీడియో
Tokyo Olympics ఒలింపిక్స్‌లాంటి గేమ్స్‌లో సాధారణంగా అథ్లెట్లకు కండోమ్‌లు ఇస్తుంటారు. ఒకవేళ వాళ్లు సెక్స్ చేసినా.. హెచ్ఐవీలాంటి వాటి బారిన పడకుండా సురక్షిత శృంగారం చేయాలన్న ఉద్దేశంతో గేమ్స్ విలేజ్‌లో వీటిని ఫ్రీగా ఇస్తారు.

టోక్యో: ఒలింపిక్స్‌లాంటి గేమ్స్‌లో సాధారణంగా అథ్లెట్లకు కండోమ్‌లు ఇస్తుంటారు. ఒకవేళ వాళ్లు సెక్స్ చేసినా.. హెచ్ఐవీలాంటి వాటి బారిన పడకుండా సురక్షిత శృంగారం చేయాలన్న ఉద్దేశంతో గేమ్స్ విలేజ్‌లో వీటిని ఫ్రీగా ఇస్తారు. అయితే అదే కండోమ్‌ను తన కయాక్ (చిన్న పడవ)ను రిపేర్ చేయడానికి ఉపయోగించింది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఓ అథ్లెట్. అంతేకాదు అదే కయాక్తో బరిలోకి దిగి ఏకంగా ఓ గోల్డ్, మరో బ్రాంజ్ మెడల్ గెలవడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన స్లాలోమ్ కనోయిస్ట్ జెస్సికా ఫాక్స్ ఇలా కండోమ్‌తో తన కయాక్ రిపేర్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన కయాక్ ముందు ఏర్పిడిన చిన్న రంధ్రాన్ని ఆమె కండోమ్‌తో మూసివేయడం ఆ వీడియోలో చూడొచ్చు. తన టిక్‌టాక్ అకౌంట్లో జెస్సికా ఈ వీడియో పోస్ట్ చేసింది. కయాక రిపేర్ల కోసం కూడా కండోమ్ ఉపయోగిస్తారని మీకు తెలియదు అని జెస్సికా ఫాక్స్ కామెంట్ చేసింది. ముందు కార్బన్ మిశ్రమాన్ని ఆ రంధ్రంలో పూడ్చి.. దానిపై నుంచి కండోమ్‌ను ఇలా బిగించారు. ఈ టిక్‌టాక్ వీడియో మెల్లగా ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలోకి కూడా వెళ్లి వైరల్ అయిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

