Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మిర్జా – రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెకండ్ రౌండ్లో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే), మకాటో నినోమియా (జపాన్) జంటపై విజయం సాధించింది. ఏడో నంబర్ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా- భూపన్న జోడీ 6-4, 7-6 (11-9)తో గెలుపొందింది. ఫస్ట్ సెట్లో తొలి సర్వీస్ గెలిచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. చివరి సెట్ టై బ్రేక్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. చివరకు సానియా మిర్జా, బోపన్న విజేతగా నిలిచారు. క్వార్టర్ ఫైనల్లో జెలెన ఓస్టపెంకో (లాథ్వియా), డేవిడ్ వేగ హెర్నాండేజ్ (స్పెయిన్)ను ఢీ కొట్టనున్నారు.
కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సానియా డబుల్స్‌లో ఓటమి పాలైంది. రెండో రౌండ్లోనే ఆమె పోరాటం ముగిసింది. సానియా, అన్నా డానిలినా (కజకిస్థాన్) జోడీ అలిసన్ వాన్ ఉత్వాన్క్ (బెల్జియం), అన్హేలిన కలినినా (ఉక్రెయిన్) చేతిలో 4-6 6-4 2-6తో పారాజయం చెందింది.