Australia | అడిలైడ్: ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 120 నాటౌట్; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో విజృంభించడంతో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా టీ20 సిరీస్ విజయం సాధించింది. పరుగుల వరద పారిన పోరులో ఆసీస్ 34 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది.
మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసింది. మ్యాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 207 రన్స్ చేసింది.