ఆఫ్ఘన్ మహిళలను ఆడనివ్వరా.. అయితే మెన్స్‌తో మ్యాచ్ రద్దు: క్రికెట్ ఆస్ట్రేలియా

మెల్బోర్న్: ఆఫ్ఘనిస్తాన్‌తో చరిత్రాత్మక టెస్టు క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. కానీ ఆ మ్యాచ్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. నవంబర్ 27వ తేదీన హోబార్ట్‌లో నిజానికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా పాలన చేపట్టిన తాలిబన్లు .. మహిళలు క్రికెట్ ఆడరాదు అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపై తాలిబన్ కల్చరల్ నేత అహ్మదుల్లా వాసిక్ మాట్లాడుతూ.. మహిళలు క్రికెట్ ఆడరని, ఇదే కాదు ఏ ఆట కూడా వాళ్లు ఆడబోరన్నారు. మహిళలు క్రికెట్ ఆడాల్సినంత అవసరం లేదన్నారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ముఖం కానీ, శరీరం కానీ బహిర్గతం అవుతుందని, ఇస్లాం ప్రకారం మహిళల్ని ఇలా చూడలేమన్నారు. తాలిబన్ నేత మహిళల క్రికెట్‌పై కామెంట్ చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా స్పందించింది. మహిళలకు ఆడే అవకాశం ఇవ్వనప్పుడు.. ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతోనూ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొన్నది. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగాలని ఆశిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. అందరికీ ఆట అన్నదే తమ నినాదం అని, మహిళలను కూడా సమానంగా చూడాలని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొన్నది. ఒవకేళ తాలిబన్లు మహిళా క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుంటే, అప్పుడు మెన్స్ జట్టుతో హోబర్ట్‌లో జరిగే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

