ICC Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కమ్మిన్స్..
ICC Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇ
ICC Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల టెస్టుల్లో గాయపడిన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌కు సైతం జట్టులో చోటు కల్పించింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్, మెక్‌గర్క్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవమైన ఫామ్‌తో జాతీయ జట్టుకు దూరం కాగా.. మళ్లీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లతో పాటు స్టార్ బ్యాటర్స్‌తో జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది.
ఈ సందర్భంగా ఆసిస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిల్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్, వెస్టిండ్ సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనలో విజయవంతమైన జట్టు ఇదని తెలిపారు. పాకిస్థాన్ సిరీస్‌లోనూ విజయవంతమైన ఆటగాళ్లతో కూడిన సమతుల్య, అనుభవజ్ఞులైన జట్టని.. పాక్‌లోని పరిస్థితులకు అనుగుణంగా బెస్ట్ టీమ్‌ని ఎంపిక చేశామనన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్నది. పాకిస్థాన్‌తో పాటు దుబాయి వేదికగా జరుగనున్నది. టీమిండియా మ్యాచులు దుబాయిలో జరుగుతాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీకి ఇటీవల ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను ప్రకటించారు. ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఎనిమిది జట్లను రెండేసి గ్రూపులుగా విభజించారు.
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

