AUS vs WI: వార్నర్ పోరాడినా ఆఖరి టీ20 విండీస్‌దే.. కరేబియన్లకు ఓదార్పు విజయం
AUS vs WI: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ముగిసిన ఆఖరి మ్యాచ్‌లో కరేబియన్ వీరులు ఓదార్పు విజయాన్ని అందుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు చేసిన విండీస్.. ఆ తర్వాత ఆసీస్‌ను కట్టడి చేసింది.
AUS vs WI: ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ ఘన విజయంతో ముగించింది. గబ్బా టెస్టులో విజయం తర్వాత ఆ జట్టుకు ఈ టూర్లో ఇది సెకండ్ విక్టరీ. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ముగిసిన ఆఖరి మ్యాచ్‌లో కరేబియన్ వీరులు ఓదార్పు విజయాన్ని అందుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు చేసిన విండీస్.. ఆ తర్వాత ఆసీస్‌ను కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్.. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో విండీస్ 37 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ ఓడినా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
పెర్త్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. టాపార్డర్ వైఫల్యంతో 8.4 ఓవర్లలో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెర్ఫేన్ రూతర్ఫర్డ్.. 40 బంతుల్లో ఐదు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక విండీస్ విధ్వంసక వీరుడు ఆండ్రీ రసెల్.. కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు. రసెల్, రూథర్‌ఫర్డ్‌లు ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించారు.
అనంతరం ఛేదనలో ఆసీస్ కూడా దంచికొట్టింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (17), డేవిడ్ వార్నర్ (49 బంతుల్లో 81, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆ జట్టు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. మార్ష్ త్వరగా ఔటైనా వార్నర్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. రెండో వికెట్‌కు ఆరోన్ హార్డీ (16)తో కలిసి 46 రన్స్ జోడించాడు. 25 బంతుల్లోనే అతడు అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో వార్నర్.. రోస్టర్ ఛేజ్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి రసెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో జోష్ ఇంగ్లిస్ (1) కూడా నిష్క్రమించాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12) ఈసారి మ్యాజిక్ చేయలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా అతడి పోరాటం విండీస్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

