AUS vs NZ: ఆసీస్ అదే జోరు.. కివీస్ ఎదుట భారీ లక్ష్యం
AUS vs NZ: ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి వీరబాదుడు బాదారు. 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయి కివీస్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపారు.
AUS vs NZ: వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా దూకుడు కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడినా తర్వాత పుంజుకున్న కంగారూలు.. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి వీరబాదుడు బాదారు. 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయి కివీస్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపారు. కొద్దిరోజుల క్రితమే దక్షిణాఫ్రికా పర్యటనలో మోచేతి గాయంతో వరల్డ్ కప్‌లోని తొలి అంచె పోటీలకు దూరమై జట్టులోకి తిరిగొచ్చిన ట్రావిస్ హెడ్.. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసిన హెడ్.. మొత్తంగా 67 బంతుల్లో 10 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్.. 65 బంతుల్లో 5 బౌండరీలు, ఆరు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.
వన్డే వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్.. వార్నర్‌తో కలిసి కంగారూల స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి కివీస్ బౌలర్లను ఉతికారేశారు. తొలివికెట్ కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు. కొద్ది ఓవర్ల వ్యవధిలోనే వార్నర్, హెడ్ నిష్క్రమించారు. వన్ డౌన్లో వచ్చిన మిచెల్ మార్ష్.. 51 బంతుల్లో 36 పరుగులు చేశాడు. స్మిత్ (18), లబూషేన్ (18)లు విఫలమైనా మ్యాక్స్‌వెల్ మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లోనే ఐదు బౌండరీలు రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ కూడా 28 బంతుల్లో 4 బౌండరీలు ఒక సిక్సర్ సాయంతో 38 పరుగులు సాధించాడు. ఆఖర్లో పాట్ కమిన్స్.. 14 బంతుల్లోనే 2 బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా మూడోసారి 350 ప్లస్ స్కోరు కావడం గమనార్హం. వన్డేల చరిత్రలో ఇది రికార్డు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 367 పరుగులు చేసిన ఆసీస్ తర్వాత నెదర్లాండ్స్‌పై 399 పరుగులు చేసింది. తాజాగా 388 పరుగులు చేయడం గమనార్హం.
భారీ లక్ష్య ఛేదనలో కివీస్ కూడా ధాటిగానే ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

