AUS vs NED | వార్నర్ శతకం.. శివాలెత్తిన మ్యాక్సీ.. నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యం
AUS vs NED | వార్నర్‌కు తోడుగా మ్యాక్స్‌వెల్ కూడా ఆఖర్లో శివాలెత్తడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.
AUS vs NED | వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న పలు జట్లు 350 ను మినిమం టార్గెట్‌గా ఫిక్స్ చేసుకున్నట్టున్నాయి. చిన్నా, పెద్ద జట్లు అనే తేడాలేకుండా బ్యాటర్లు బ్యాట్ ఝుళిపిస్తున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు తమ తమ గత మ్యాచ్‌లలో ప్రత్యర్థుల ఎదుట 300 ప్లస్ టార్గెట్‌ను నిలిపాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా మరోసారి రెచ్చిపోయి ఆడి నెదర్లాండ్స్ ఎదుట 400 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అంతగా అనుభవంలేని నెదర్లాండ్స్ బౌలర్లను ఉతికారేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104, 11 బౌండరీలు, 3 సిక్సర్లు) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అలరించాడు.
వార్నర్‌కు తోడుగా మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106, 9 ఫోర్లు, 8 సిక్సర్లు) కూడా ఆఖర్లో శివాలెత్తడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71, 9 ఫోర్లు, 1 సిక్సర్), మార్నస్ లబూషేన్ (47 బంతుల్లో 62, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మిడిలార్డర్లో ఆసీస్ స్కోరుబోర్డును నడిపించారు.
వార్నర్ రికార్డు శతకం..
తొలి వికెట్‌కు మిచెల్ మార్ష్‌తో 28 పరుగులు జోడించిన వార్నర్.. తర్వాత స్టీవ్ స్మిత్‌తో కలిసి రెండో వికెట్ కు 132 పరుగులు జతచేశాడు. గత నాలుగైదు మ్యాచ్‌లుగా తడబడుతున్న స్మిత్ నేటి మ్యాచ్‌లో అర్థ సెంచరీతో కదంతొక్కాడు. స్మిత్ నిష్క్రమణ తర్వాత వార్నర్.. లబూషేన్‌తో కలిసి 76 బంతుల్లోనే 84 పరుగులు జోడించాడు. ఇందులో 62 పరుగులు లబూషేన్వే కావడం విశేషం. 40 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన వార్నర్.. 91 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. వరల్డ్ కప్‌లో అతడికి ఇది వరుసగా రెండో సెంచరీ. మొత్తంగా వన్డే ప్రపంచకప్‌లో ఆరోవది. సెంచరీ తర్వాత వార్నర్ వాన్ బీక్ వేసిన 40వ ఓవర్లో తొలి బంతికే ఆర్యన్ దత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మ్యాక్సీ బాదుడు..
వార్నర్ నిష్క్రమణ తర్వాత ఆసీస్ స్కోరుబోర్డును పరుగెత్తించే బాధ్యతలను మ్యాక్స్‌వెల్ తీసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ (8) రనౌట్ అయినా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను అవతలి ఎండ్‌లో నిలబెట్టి వీరబాదుడు బాదాడు. వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో 4, 6 కొట్టిన అతడు బస్ డీ లీడ్వేసిన మరుసటి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదడమే గాక వన్డేలలో 24వ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వాన్ బీక్ వేసిన 48వ ఓవర్లో కూడా 6, 4, 6 తో విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మ్యాక్సీ.. దొరికిన బంతిని దొరికినట్టు బాదాడు. 48వ ఓవర్ ముగిసేటప్పటికీ 37 బంతుల్లో 75 పరుగులు చేసిన మ్యాక్సీ.. బస్ డీ లీడ్ వేసిన 49వ ఓవర్లో 4, 4, 6, 6 బాది 40 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఇదే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్.. శ్రీలంకపై 49 బంతుల్లోనే సెంచరీ చేయడమే ఇదివరకు రికార్డుగా ఉంది. కమిన్స్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ ఏడో వికెట్‌కు 44 బంతుల్లోనే 103 పరుగులు జోడించగా ఇందులో కమిన్స్ చేసినవి 8 పరుగులు మాత్రమే. ఆఖరి పది ఓవర్లలో ఆసీస్ ఏకంగా 131 పరుగులు చేయడం విశేషం. డచ్ బౌలర్లలోవాన్ బీక్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బస్ డీ లీడ్ పది ఓవర్లలో ఏకంగా 115 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

