T20 World Cup | ఆసీస్ ఆల్‌రౌండ్ షో.. ఇంగ్లండ్‌కు తప్పని పరాభవం
సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై 36 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు మరింత చేరువైంది. గ్రూప్-బి లో ఇంగ్లండ్‌తో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో తర్వాత బంతితోనూ చెలరేగిన కంగారూలు బట్లర్ సేనకు చుక్కలు చూపించారు.
T20 World Cup | బార్బడోస్: సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై 36 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు మరింత చేరువైంది. గ్రూప్-బి లో ఇంగ్లండ్‌తో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో తర్వాత బంతితోనూ చెలరేగిన కంగారూలు బట్లర్ సేనకు చుక్కలు చూపించారు. డేవిడ్ వార్నర్ (39), మార్ష్ (35), హెడ్ (34), స్టోయినిస్ (30) ధాటిగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 201/7 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లకు 165/6కే పరిమితమైంది. ఓపెనర్లు జోస్ బట్లర్ (42), ఫిల్ సాల్ట్ (37) తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 73 పరుగులు జతచేసినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ వేగంగా ఆడకపోవడంతో ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (2/28), పాట్ కమిన్స్ (2/23) ఇంగ్లీష్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

