PAK vs SA: నవాజ్ పై బాబర్ సీరియస్.. అప్పుడూ ఇప్పుడూ బలైంది అతడే..!
PAK vs SA: విజయం కోసం పాకిస్తాన్ బౌలర్లు ఆఖరిదాకా పోరాడినా మహ్మద్ నవాజ్ వేసిన 48వ ఓవర్లో రెండో బంతికి కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టి సఫారీలకు అనూహ్య విజయాన్ని అందించాడు.
PAK vs SA: పాకిస్తాన్ – దక్షిణాఫ్రికా మధ్య చెన్నై వేదికగా శుక్రవారం అత్యంత ఉత్కంఠగా ముగిసిన పోరులో సఫారీలు ఒక్క వికెట్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. విజయం కోసం పాకిస్తాన్ బౌలర్లు ఆఖరిదాకా పోరాడినా మహ్మద్ నవాజ్ వేసిన 48వ ఓవర్లో రెండో బంతికి కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టి సఫారీలకు అనూహ్య విజయాన్ని అందించాడు. అయితే కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టిన తర్వాత పాక్ సారథి బాబర్ ఆజమ్.. నవాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
48వ ఓవర్ వేయాల్సిందిగా బాబర్.. నవాజ్‌కు బంతినిచ్చాడు. కానీ కెప్టెన్ నమ్మకాన్ని నవాజ్ మరోసారి వమ్ముచేశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి షంసీ సింగిల్ తీసి మహారాజ్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. నవాజ్ రెండో బంతికి ఫ్లాట్ డెలివరీని సంధించగా.. మహారాజ్ బ్యాక్ ఫుట్ తీసుకుని బంతిని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ దాటించాడు. దీంతో మహారాజ్, షంసీలతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోగా పాక్ టీమ్ మాత్రం నిరాశకు గురయ్యింది. అదేసమయంలో బాబర్ నవాజ్ దగ్గరికెళ్లి.. ‘ఆ ఒక్క బాల్ వేయడం తప్ప మరేం రాదా నీకు..?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కెప్టెన్ తన మీద కోప్పడుతుంటే నవాజ్ మాత్రం తల దించుకుని పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Babar Azam abusing Mohammad Nawaz.#SAvPAK #SAvsPAK #PAKvSA #PAKvsSA #ICCCricketWorldCup #CricketWorldCup #Nawaz #BabarAzam #Babar pic.twitter.com/d2iIeDWA5b
— ICC World Cup 2023 (@WoKyaHotaHai) October 27, 2023
కాగా నవాజ్ పాక్‌కు షాకులివ్వడం ఇదే కొత్త కాదు. గతేడాది మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆఖరి ఓవర్ నవాజే వేశాడు. అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో నవాజ్.. ఆఖర్లో వైడ్ వేయడం.. అశ్విన్ చివరి బంతికి సింగిల్ తీసి విజయాన్ని అందించినప్పుడు కూడా నవాజ్ బాధితుడయ్యాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ప్రత్యర్థి మారినా నవాజ్ అదృష్టం మాత్రం మారలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

