Asian Handball Federation : జగన్ మోహన్ రావుకే మద్దతు ప్రకటించిన ఏహెచ్ఎఫ్
జగన్ మోహన్ రావుకే మద్దతు ప్రకటించిన ఏహెచ్ఎఫ్ | అసమ్మతి ప్రధాన కార్యదర్శి ప్రీత్ పాల్ సింగ్ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బాలముచిను తొలగిస్తూ
జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) – Handball Federation of Indiaలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఆసియా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఏహెచ్ఎఫ్)- Asian Handball Federation ఈసందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. అసమ్మతి ప్రధాన కార్యదర్శి ప్రీత్ పాల్ సింగ్ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బాలముచిను తొలగిస్తూ ఇటీవల జరిగిన అత్యవసర ఏజీఎంలో ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని ఏహెచ్ఎఫ్ తాజాగా ఆమోదించింది.

తమ అధికారిక వెబ్ సైట్ లో హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావును ప్రకటించగా.. కార్యదర్శిగా ఉన్న సలూజ ఫొటోతో పాటు వివరాలను ఏహెచ్ఎఫ్ తొలగించింది. భారత హ్యాండ్ బాల్ లోని అంతర్గత రాజకీయాలను అర్థం చేసుకొని తనకు మద్దతుగా నిలిచిన ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ కు ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. ఇటీవల లక్నోలో ముగిసిన 44వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు హెచ్‌ఎఫ్‌ఐను అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అభినందించింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

