సౌథాంప్టన్: ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఓ ఫన్నీ మీమ్‌తో సెటైర్ వేశాడు. అశ్విన్ మంచి స్పిన్నరే కావచ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒకడు మాత్రం కాదని ఈ మధ్య మంజ్రేకర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇండియాలో అతడు బాగానే రాణించినా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడని మంజ్రేకర్ అన్నాడు. అయితే దీనిపై అశ్విన్ కాస్త వెటకారంగా స్పందించాడు.
మంజ్రేకర్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. తమిళ మూవీ అన్నియన్ (అపరిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్ చేశాడు. అప్డి సొల్లాదా చారీ, మనసెల్లమ్ వలికిర్దు (అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది) అనే తమిళ డైలాగుతో ఉన్న ఫొటోను అశ్విన్ వ్యంగ్యంగా పోస్ట్ చేయడం విశేషం. ఇప్పటి వరకూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన అశ్విన్ కెరీర్లో మొత్తం 30సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అయితే ఆ నాలుగు దేశాల్లో మాత్రం ఒక్కసారి కూడా అశ్విన్ ఐదు వికెట్లు తీయలేకపోయాడని, అలాంటి ప్లేయర్ ఆల్‌టైమ్ గ్రేట్ ఎలా అవుతాడని మంజ్రేకర్ ప్రశ్నించాడు.