Ashes | బ్యాటర్లపై సెటైర్లు.. స్టేడియం నుంచి ముగ్గురు ప్రేక్షకులు అవుట్
Ashes | నాలుగో యాషెస్ టెస్టులో పోరాడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో 36/4తో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన

నాలుగో యాషెస్ టెస్టులో పోరాడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో 36/4తో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ ఇద్దరూ ఎంతో నియంత్రణతో బ్యాటింగ్ చేశారు. వీళ్లిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రెండో సెషన్ ముగిసింది.
ఆ సమయంలో ఇద్దరు బ్యాటర్లూ డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తున్నారు. మైదానంలో వీళ్లు చూపిన పోరాట పటిమను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే అదే సమయంలో కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ ఇద్దరు ఆటగాళ్లపై బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు. ‘స్టోక్స్.. నువ్వు లావుగా ఉన్నావ్‘ అంటూ కేకలు వేశారు. వీటిని స్టోక్స్ పట్టించుకోలేదు. ఆ వెంటనే బెయిర్‌స్టోపై కూడా ఇలాంటి కామెంట్లే చేశారు.
‘‘నీ జంపర్ తీసేయ్ బెయిర్‌స్టో.. కొంచెం బరువు తగ్గు బెయిర్‌స్టో’’ అన్నారు. తన టీమ్‌మేట్‌పై ఇలాంటి కామెంట్లు చేయడంతో స్టోక్స్ చాలా సీరియస్‌గా వారి వైపు చూశాడు. ఇంతలో కల్పించుకున్న బెయిర్‌స్టో ‘‘నిజమే.. వెనక్కు తిరిగి వెళ్లిపో. పిరికి సన్నాసి’’ (పాల్, దట్స్ రైట్. జస్ట్ టర్న్ అరౌండ్ అండ్ వాక్ ఎవే. వీక్ యాజ్ పిస్) అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ముగ్గురు ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపేశారు. ఆ తర్వాత బెయిర్‌స్టో సెంచరీతో అదరగొట్టాడు. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ.. తనతో గొడవ పడిన వాళ్లు స్టేడియంలో ఉండి ఉంటే బాగుండేదంటూ చురకలేశాడు.
The Sydney Test has been marred by crowd abuse for the second year in a row, with England stars Ben Stokes and Jonny Bairstow reacting angrily after being sledged on Friday. Read the full story: https://t.co/OkOsCV7vuW pic.twitter.com/4FdamS2BCA
— The Sydney Morning Herald (@smh) January 7, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

