Robin Uthappa: పీఎఫ్ మోసం కేసులో.. మాజీ క్రికెటర్ ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ
Robin Uthappa: ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. క్లాతింగ్ కంపెనీలోని వర్కర్లకు పీఎఫ్ ఇవ్వలేదని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 27వ తేదీలోగా 24 లక్షలు చెల్లించకుంటే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
బెంగుళూరు: మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప(Robin Uthappa)కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఉద్యోగులకు పీఎఫ్ ఇచ్చే అంశంలో అతను మోసానికి పాల్పడినట్లు తేలింది. అతనికి చెందిన బట్టల కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ జమ చేయలేదు. అయితే 27వ తేదీ వరకు అతని టైం కల్పించారు. ఒకవేళ 24 లక్షల బకాయి చెల్లించకుంటే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
బెంగుళూరుకు చెందిన సెంటౌరస్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. ఆ కంపెనీ సుమారు 24 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు అతను చెల్లించలేదని ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తన అరెస్టు వారెంట్లో పేర్కొన్నారు. డిసెంబర్ నాలుగవ తేదీన ఆ వారెంట్ జారీ చేశారు. ఉద్యోగులకు చెందిన పీఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసినట్లు ఊతప్పపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అతను ఉద్యోగుల అకౌంట్లలోకి నిధులను డిపాజిట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పేద కార్మికుల పీఎఫ్ అకౌంట్లను సెటిల్ చేయని ఊతప్పను అరెస్టు చేయాలని లేఖలో కోరారు. భారత జట్టు తరపున 59 అంతర్జాతీయ మ్యాచ్లను ఆడాడు. ఐపీఎల్లో అతను పాపులర్ ప్లేయర్. ఇంటర్నేషనల్ కెరీర్లో ఊతప్ప 1183 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

