పారిస్ : అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ప్రతిష్టాత్మక ‘బాలన్ డి ఓర్’ అవార్డును గెలుచుకున్నాడు. గత యేడాది ఫిఫా ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన మెస్సిని ఈ అవార్డు వరించింది.
మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు చెందిన ఎర్లింగ్ హాలండ్, పిఎస్జి క్లబ్ సహచరుడు, ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబప్పెతో పోటీపడి మెస్సి ఈ అవార్డును దక్కించుకున్నాడు.