Lionel Messi: చరిత్ర సృష్టించిన అర్జెంటీనా స్టార్.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్‌తో మెస్సీ రికార్డు
Lionel Messi: లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. అల్జీరియాతో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఇక వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమానంగా నిలిచాడు మెస్సీ.
కన్సాస్: అర్జెంటీనా ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఇక మెస్సీ ఖాతాలో మరో రికార్డు పడింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమానంగా నిలిచాడు. జర్మనీ ఫుట్‌బాలర్ క్లోస్ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధికంగా 16 గోల్స్ చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు అతని రికార్డును మెస్సీ సమం చేశాడు.
ఆరో వరల్డ్‌కప్ ఆడుతున్న మెస్సీ.. 200వ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. 8 సార్లు బాలన్ డీఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ.. అల్జీరియాతో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా గట్టిగా పోరాడాల్సివ చ్చింది. డిఫెండింగ్ చాంపియన్ రూపంలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఈసారి తన తొలి మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది.
మెస్సీ తన డ్రిబ్లింగ్ మ్యాజిక్‌తో మళ్లీ ఆకట్టుకున్నాడు. తొలుత 17వ నిమిషంలో గోల్ కొట్టాడు. మియామీ టీమ్మేట్ రోడ్రిగో డీ పౌల్ ఇచ్చిన పాస్‌ను మెస్సీ గోల్‌గా మలిచాడు. ఇక జిదానే చేసిన పొరపాటును మెస్సీ సద్వినియోగం చేసుకుని రెండో గోల్ కొట్టాడు. మళ్లీ 76వ నిమిషంలో నికోలస్ గొంజాలేజ్ ఇచ్చిన పాస్‌ను అద్భుతమైన రీతిలో హ్యాట్రిక్ గోల్ కొట్టాడు మెస్సీ. దీంతో గ్రూపు జేలో అర్జెంటీనా శుభారంభాన్ని అందుకున్నది. లియోనల్ మెస్సీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
الـهاتريييييييييييييك 🐐⚽️⚽️⚽️ pic.twitter.com/lE4LV2uVvW
— Messi World (@M10GOAT) June 17, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

