FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా(Argentina) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వేళైంది. కొలంబియాకు చెక్ పెట్టిన స్విట్జర్లాండ్‌ను లియోనల్ మెస్సీ(Lionel Messi) సేన ఢీకొట్టనుంది. కీలకమైన మ్యాచ్ కావడంతో ఏ చిన్న పొరపాటు చేయొద్దని ఇరుజట్లు భావిస్తున్నాయి. అయితే.. ఫామ్‌లో ఉన్న మెస్సీ పెనాల్టీలను గోల్‌గా మలచలేకపోవడం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో స్విస్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా మేనేజర్ లియోనల్ స్కలోని(Lionel Scaloni) మీడియాతో మాట్లాడుతూ పెనాల్టీ అవకాశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడుతున్న అర్జెంటీనాకు నాకౌట్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. కార్బో వెర్డే, ఈజిప్ట్ చేతిలో అతికష్టమ్మీద గట్టెక్కిన మెస్సీ సేన.. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. శనివారం మ్యాచ్ ఉన్నందున మేనేజర్ లియోనల్ స్కలోని మీడియాతో మాట్లాడాడు. ఈ ఎడిషన్‌లో రెండు పెనాల్టీలను గోల్ పోస్ట్‌లోకి పంపని మెస్సీకి మరో అవకాశం ఇస్తారా? లేదా? అనే ప్రశ్నకు అతడు అవును అనిగానీ, కాదు అనిగానీ చెప్పలేదు.
“QUÉ HAGA LO QUE QUIERA, VA A PATEAR ÉL SI QUIERE”
Lionel Scaloni respecto a los últimos dos penales que ejecutó Messi.#DSPORTSNoticiasNite#FIFAWorldCup pic.twitter.com/wktLEzd0u6
— DSPORTS (@DSports) July 11, 2026
‘పెనాల్టీని ఉపయోగించుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా మెస్సీ చేతుల్లో ఉంది. అతడికి నచ్చినట్టు చేయని. అతడు వద్దనుకుంటే పెనాల్టీ షాట్ ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయితే.. మెస్సీ తానే ఆ అవాశాన్ని తీసుకుంటానంటే మేము కాదనం. మైదానంలో అతడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆమోదిస్తాం. పెనాల్టీ ఆడాలా? వద్దా? అనే విషయాన్ని మెస్సీకి చెప్పాలనే విషయంపై నాలోనే సందిగ్ధత ఉంది. ఎందుకంటే 39 ఏళ్లున్న మెస్సీ ఇప్పటికీ గొప్ప ఆటగాడే’ అని స్కలోని వెల్లడించాడు.
When Messi missed the penalty against Egypt 🙄. #ARGEGY pic.twitter.com/yHtLMEVGTk https://t.co/WtzLnWLPob
— The Final Whistle (@Rufus_45) July 7, 2026
ఫిఫా వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు అర్జెంటీనా రిఫరీలను నియమించడం, మెస్సీ బృందానికి అనుకూలంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు అనే విషయాలపైనా స్కలోని స్పందించాడు. తాము గత ఎడిషన్‌లో విజేతగా నిలిచినందున ఈసారి తమను గెలవనీయొద్దని కొందరు అలా మాట్లాడుతున్నారు. నిజానికి వీఏఆర్ టెక్నాలజీ ఉపయోగంతో అన్ని జట్ల మాదిరిగానే మేము నష్టపోతున్నాం. అందరూ అనుకుంటున్నట్టు అర్జెంటీనాకు ఫిఫా యాజమాన్యం, రిఫరీలు సాయం చేయడం లేదు అని స్పష్టం చేశాడు.
Lionel Messi is actually terrifying 😳🔥
This clip proves why defenders feared him. pic.twitter.com/1b4UUY8CoV— PrimePhase (@PrimePhaseX) July 10, 2026
లీగ్ దశలో ఆస్ట్రియాపై పెనాల్టీని మిస్ చేసిన మెస్సీ.. 16వ రౌండ్లో ఈజిప్ట్పైనా పెనాల్టీని గోల్‌పోస్ట్‌లోకి పంపడంలో విఫలమయ్యాడు. అయినా.. చివరకు మెరుపు గోల్‌తో జట్టును క్వార్టర్స్‌కు తీసుకెళ్లాడీ సాకర్ లెజెండ్. ఎనిమిది గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో నిలిచిన మెస్సీ స్విట్జర్లాండ్‌పై మెరిస్తే.. కిలియన్ ఎంబాపే రెండో స్థానానికి పడిపోయే అవకాశముంది.
🚨🗣️ Lionel Scaloni on Lionel Messi:
“At 39, some might think he’s (Leo Messi) no longer at the same level, but I don’t know how many times I’ve said it: as long as Messi still wants to play, he’ll remain the best. That’s what I believe, and not because I’m his coach.”
“As… pic.twitter.com/Sgo0Gq1VGE
— The Touchline | 𝐓 (@TouchlineX) July 11, 2026