స్వియాటెక్ సూపర్
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మరో పెను సంచలనం తృటిలో మిస్సయింది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ అద్భుత విజయంతో బయటపడింది.
- ఒసాకాపై అద్భుత విజయం
- జొకోవిచ్, అల్కరజ్ ముందంజ
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మరో పెను సంచలనం తృటిలో మిస్సయింది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ అద్భుత విజయంతో బయటపడింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో స్వియాటెక్ 7-6(7-1), 1-6, 7-5తో అన్‌సీడెడ్ నవోమి ఒసాకాపై గెలిచి ముందంజ వేసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది.
ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన స్వియాటెక్‌కు జపాన్ స్టార్ ఒసాకా దీటైన పోటీనిచ్చింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో దక్కించుకున్న స్వియాటెక్‌కు రెండో సెట్లో ఒసాకా అనూహ్యంగా షాక్ఇచ్చింది. ఏకంగా 6-1తో సెట్‌ను కైవసం చేసుకుని పోటీలోకి వచ్చింది. 4-0తో ఆధిక్యం కనబరిచి సెట్‌ను సొంతం చేసుకునేలా కనిపించగా..స్వియాటెక్ పడిలేచిన కెరటంలా పుంజుకుంది.
గేమ్ గేమ్‌కు పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ చివరికి ఒసాకా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ 6-4, 7-6(7/3), 6-4తో హెర్బర్ట్‌పై అలవోకగా గెలిచాడు. అల్కరజ్ 6-3, 6-4, 2-6, 6-2తో డీ జాంగ్‌పై చెమటోడ్చి నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

