పెర్త్: బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే ఆదివారం అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ నమోదు అయ్యింది. ఆండ్రూ టై వేసిన ఓవర్లో ఫించ్ చెలరేగిపోయాడు. పెర్త్ స్కార్చర్స్ పేస్ బౌలర్ వేసిన బౌలింగ్లో ఫించ్ 31 రన్స్ రాబట్టాడు. పెర్త్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మెల్బోర్న్ రెనిగేడ్స్ బ్యాటర్ ఫించ్ దుమ్మురేపాడు. ఏడు బంతులు వేసిన ఆ ఓవర్లో ఫించ్ 30 రన్స్ చేయగా.. ఒక రన్ వైడ్రూపంలో వచ్చింది.
ఇన్నింగ్స్ 18వ ఓవర్లో టై వేసిన ఫస్ట్ బంతికి ఫించ్ రెండు రన్స్ తీశాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఇక నాలుగో బంతిని మళ్లీ రెండు రన్స్ తీశాడు. ఆ తర్వాత నో బాల్కు సిక్సర్ కొట్టాడు. మళ్లీ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఫించ్ 35బంతుల్లో 76 రన్స్ చేసినా.. మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టు 10 రన్స్ తేడాతో పెర్త్ స్కార్చర్స్ చేతిలో ఓటమి పాలైంది.