James Anderson | వెటరన్ పేసర్‌కు అత్యున్నత గౌరవం.. ‘నైట్‌హుడ్’ స్వీకరించిన అండర్సన్
James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)కు అరుదైన గౌరవం లభించింది. ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవలందించిందుకు 'నైట్‌హుడ్' (Knighthood) బిరుదును స్వీకరించాడీ లెజెండ్.
James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)కు అరుదైన గౌరవం లభించింది. ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవలందించిందుకు ‘నైట్‌హుడ్’ (Knighthood) బిరుదును స్వీకరించాడీ లెజెండ్. విండ్సర్ క్లాస్లేలో మంగళవారం కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి అన్నె(Princess Anne) చేతుల మీదుగా మంగళవారం అండరన్సన్ నైట్ హుడ్ మెడల్‌ను అందుకున్నాడు. భార్య, పిల్లలతో కలిసి ఈ వేడుకకు హాజరైన అతడు.. అనంతరం తాను సాధించిన ‘నైట్ హుడ్’ పతకాన్ని చూపిస్తూ సంబురపడిపోయాడు. ఇక నుంచి అండర్సన్ పేరు ముందు సర్ అనే పదం చేరనుంది.
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) నైట్‌హుడ్ అవార్డు కోసం జిమ్మీ పేరును సిఫారసు చేశారు. ఈ అవార్డుకు కన్జర్వేటిప్ పార్టీ ప్రధాని నామినేట్ చేసిన రెండో మాజీ ఆటగాడిగా అండర్సన్ గుర్తింపు సాధించాడు. 2019లో థెరీసా మే.. జెఫ్రీ బాయ్‌కాట్‌ను నైట్‌హుడ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అత్యున్నత గౌరవంతో తన సహచరులు ఆండ్రూ స్ట్రాస్, అలెస్టర్ కుక్ల సరసన చేరునున్నాడీ లెజెండ్. ఇప్పటివరకు 12 మంది ఇంగ్లండ్ మాజీలు మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు.
Arise, Sir James Anderson! 🤩👏
A special day for @jimmy9 as he received his knighthood from Princess Anne at Windsor Castle!
The greatest fast bowler to ever do it. 🐐
🌹 #RedRoseTogether pic.twitter.com/4H9MmTcQsk
— Lancashire Cricket (@lancscricket) October 28, 2025
ఇంగ్లండ్ గొప్ప బౌలర్లలో ఒకడైన అండర్సన్ సుదీర్ఘ కెరియర్లో సంచలన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. అయితే.. టెస్టు బౌలర్‌గానే ఎక్కువ ప్రభావం చూపించాడీ పొడగరి పేసర్. బాల్ క్రికెట్లో 704 వికెట్లతో రికార్డు సృష్టించాడు. 2015 నుంచి వన్డేలు, టీ20లు ఆడకున్నా సరే అండర్సన్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. వన్డేల్లో 269.. పొట్టి క్రికెట్లో 18 వికెట్లు పడగొట్టాడీ మాజీ పేసర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

