Simone Biles: మరో ఈవెంట్ నుంచి తప్పుకున్న జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్
అమెరికన్ టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఒలింపిక్స్‌లో మరో ఈవెంట్ నుంచి తప్పుకుంది. రియో గేమ్స్‌లో ఆరు గోల్డ్ మెడల్స్ గెలిచిన రికార్డును బైట్స్ టోక్యోలోనూ రిపీట్ చేస్తుందని అనుకుంటున్న సమయంలో.. ఆమె వరుసగా ఒక్కో ఈవెంట్ నుంచి తప్పుకుంటోంది.

టోక్యో: అమెరికన్ టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ (Simone Biles) ఒలింపిక్స్‌లో మరో ఈవెంట్ నుంచి తప్పుకుంది. రియో గేమ్స్‌లో ఆరు గోల్డ్ మెడల్స్ గెలిచిన రికార్డును బైట్స్ టోక్యోలోనూ రిపీట్ చేస్తుందని అనుకుంటున్న సమయంలో.. ఆమె వరుసగా ఒక్కో ఈవెంట్ నుంచి తప్పుకుంటోంది. తాజాగా ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లోనూ ఆమె పాల్గొనడం లేదని అమెరికా జిమ్నాస్టిక్స్ ప్రకటించింది. గతవారం ఈ ఈవెంట్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె రెండో స్థానంలో నిలిచింది.
ఇక మంగళవారం జరగనున్న బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో పాల్గొనాలా వద్దా అన్నదానిపై బైల్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అమెరికా జిమ్నాస్టిక్స్ చెప్పింది. ఈ ఈవెంట్లో రియో గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ గెలిచింది. ఆదివారం సాయంత్రం జరగబోయే అన్ఈవెన్ బార్స్, వాల్ట్ ఫైనల్స్‌లో పార్టిసిపేట్ చేయకూడదని ఇప్పటికే బైల్స్ నిర్ణయించింది. జిమ్నాస్ట్‌లు ట్విస్టీస్గా పిలిచే మెంటల్ బ్లాక్‌తో సిమోన్ బైల్స్ సతమతమవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

