Indian Wells 2024 : అమెరికాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ టోర్నీ(Indian Wells 2024)లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జన్నిక్ సిన్నర్(Jannik Sinner)కు షాకిచ్చాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రెండో సీడ్ అల్కరాజ్ అలవోక విజయం సాధించాడు.
దాంతో, 16 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని సిన్నర్ తొలి ఓటమి రుచి చూశాడు. సమఉజ్జీలైన అల్కరాజ్, సిన్నర్లు సెమీస్‌లో హోరాహోరీగా తలపడ్డారు. అయితే.. తొలి సెట్లో సిన్నర్ పైచేయి సాధించాడు. అయినా అల్కరాజ్ పట్టుదలగా ఆడి 6-1, 6-3, 6-2తో గెలుపొందాడు.
‘నొవాక్ జకోవిచ్ లాంటి దిగ్గజ ఆటగాడిని ఓడించిన సిన్నర్‌తో మ్యాచ్ కోసం మానసికంగా సిద్ధమయ్యాను. మ్యాచ్ గెలవాలంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ముఖ్యం. తొలి సెట్ కంటే రెండు, మూడు సెట్లలో నేను ఎక్కువగా పరుగెత్తాను. మ్యాచ్ ఆసాంతం పట్టుదలగా ఆడాను’ అని మ్యాచ్ అనంతరం అల్కరాజ్ వెల్లడించాడు. జన్నర్ ఆట కట్టించిన అల్కరాజ్.. యువ కెరటం డానిల్ మెద్వెదేవ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు.