Carlos Alcaraz : పురుషుల టెన్నిస్‌లో ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తున్న కార్లోస్ అల్కరాస్(Carlos Alcaraz) మరో ఘనత సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)ను చిత్తు చేసి కెరీర్ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్లకే ఈ మైలురాయికి చేరువయ్యాడీ స్పెయిన్ కుర్రాడు. 88 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డు బ్రేక్ చేసి.. పురుషుల టెన్నిస్ చరిత్రలో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన పిన్న వయస్కుడిగా అల్కరాస్ రికార్డు నెలకొల్పాడు.
టెన్నిస్‌లో కొత్త వారసుడిగా అవతరించిన కార్లోస్ అల్కారాస్ మరోసారి గర్జించాడు. కఠినమైన ప్రత్యర్థి నొవాక్ జకోవిచ్‌కు 25వ గ్రాండ్‌స్లామ్ కలను భగ్నం చేస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జయకేతనం ఎగురవేశాడు. ఉత్కంఠ పోరులో తొలి సెట్ కోల్పోయినా పట్టువదలని అల్కరాస్ నాలుగు సెట్ల పోరులో జకోకు షాకిచ్చాడు.
CARLOS ALCARAZ HAS COMPLETED THE CAREER GRAND SLAM AT 22 YEARS OLD 🏆
He becomes the youngest men’s player in tennis history to complete the feat ✨ pic.twitter.com/EIJT16Ro0K
— ESPN (@espn) February 1, 2026
అనుభవజ్ఞుడైన జకోవిచ్‌పై పైచేయి సాధించిన స్పెయిన్ కుర్రాడు 2-6 6-2 6-3 7-5తో గెలుపొంది కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్నాడు. దాంతో.. ఓపెన్ ఎరాలో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు అల్కరాస్. నంబర్ 1 ర్యాంకరైన అతడు 22 ఏళ్ల 277 రోజుల్లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ కలను నిజం చేసుకున్నాడు. 1962లో రాడ్ లావెర్ 24 ఏళ్ల 32 రోజులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.
This is what it means 🥹#coachcam #NEXO @Nexo @wwos • @espn • @tntsports • @wowowtennis pic.twitter.com/2z0YF108W8
— #AusOpen (@AustralianOpen) February 1, 2026
`పురుషుల టెన్నిస్ ఓపెన్ ఎరాలో అల్కరాస్ కంటే ముందు ఆరుగురు కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్నారు. రాడ్ లావెర్, ఆండ్రూ అగస్సీ, నొవాక్ జకోవిచ్ చెరొకసారి, రఫెల్ నాదల్ రెండుసార్లు ఈ ఘనత సాధించారు.
కార్లోస్ అల్కరాస్ 22 ఏళ్ల 272 రోజులు
రాడ్ లావెర్ 24 ఏళ్ల 32 రోజులు
రఫెల్ నాదల్ 24 ఏళ్ల 102 రోజులు
రఫెల్ నాదల్ 27 ఏళ్ల 303 రోజులు
నొవాక్ జకోవిచ్ 29 ఏళ్ల 15 రోజులు
ఆండ్రూ అగస్సీ 29 ఏళ్ల 68 రోజులు