హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ షూటింగ్ చాంపియన్షిప్లో యువ షూటర్ తురుగ అక్షయిని ఐదు పతకాలతో దుమ్మురేపింది. గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా బుధవారం ముగిసిన టోర్నీలో అక్షయిని మహిళల 25మీ జూనియర్ పిస్టల్ ఈవెంట్తో పాటు 25మీ మహిళల విభాగంలో పసిడి పతకాలు కొల్లగొట్టింది.
అదే జోరు కొనసాగిస్తూ 10మీ పిస్టల్ జూనియర్ వుమెన్, 10మీ యూత్ వుమెన్, 10మీ పిస్టల్ సబ్యూత్ వుమెన్ విభాగాల్లో రజత పతకాలు కైవసం చేసుకుంది. మరోవైపు విశ్వజయంత్ మూడు స్వర్ణాలు సహా ఒక రజతంతో ఆకట్టుకోగా, వీక్షిత్వీర్రెడ్డి మూడు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నాడు.