జూబ్లీహిల్స్: రహ్మత్‌నగర్‌కు చెందిన అఖిలేశ్వర్ స్కేటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఏడేండ్ల ప్రాయంలోనే జాతీయస్థాయిలో ఇప్పటి వరకు ఆరు బంగారు పతకాలు, మూడు ట్రోఫీలు సాధించి ఔరా అనిపించాడు. ఉమాశంకర్, రాధిక కుమారుడైన అఖిల్ ఐదేండ్ల నుంచి యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. కోచ్ ఖదీర్, ఫిట్నెస్ కోచ్ విజయ్‌కిరణ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న అఖిల్.. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన వేర్వేరు నేషనల్ లెవల్ టోర్నీల్లో అఖిల్ నాలుగు స్వర్ణ పతకాలు ఖాతాలో వేసుకున్నాడు.