Ajit Agarkar | ధోనీ ఇలాకాలో అగార్కర్.. వైభవ్ కోసమే వచ్చాడా..!
Ajit Agarkar : రివ్యూ మీటింగ్‌కు హాజరు కానుందున 'అగార్కర్ పదవీకాలం ముగిసిందా?', 'అగార్కర్ ఎక్కడ?' అంటూ వదంతులు ప్రచారమవుతున్న వేళ.. ఎట్టకేలకు మూడు రోజులకు చెపాక్ స్టేడియంలో కెమెరాకు చిక్కాడు
Ajit Agarkar : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చెన్నైలో మీడియా కంటపడ్డాడు. రివ్యూ మీటింగ్‌కు హాజరు కానుందున ‘అగార్కర్ పదవీకాలం ముగిసిందా?’, ‘అగార్కర్ ఎక్కడ?’ అంటూ వదంతులు ప్రచారమవుతున్న వేళ.. ఎట్టకేలకు మూడు రోజులకు చెపాక్ స్టేడియంలో కెమెరాకు చిక్కాడు అగార్కర్. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో ఆదివారం దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాడు చీఫ్ సెలెక్టర్.
చీఫ్ సెలెక్టర్ పదవికి రోజులు దగ్గరపడుతున్న వేళ బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కు అజిత్ అగార్కర్ హాజరవ్వకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వచ్చే వన్డే వరల్డ్‌కప్ వరకైనా అగార్కర్‌ను కొనసాగిస్తారా? అసలు అతడు ఎందుకు డుమ్మా కొట్టాడు?అని తలోరకంగా చర్చించుకున్నారు. సమీక్షా సమావేశం ముగిసిన మూడు రోజుల అనంతరం ఊహాగానాలకు తెరదించుతూ చెపాక్ స్టేడియంలో కనిపించాడు అగార్కర్.
The #DuleepTrophy final has a special observer in the stands. 👀
India chief selector Ajit Agarkar is present in Chennai and watching the action closely.
📸: JioStar
(Ajit Agarkar, India Chief Selector, Duleep Trophy, Chennai, Final)
#DuleepTrophy | #AjitAgarkar | #Cricket pic.twitter.com/zwkDdO7Kk8— CricTracker (@Cricketracker) September 6, 2026
చిదంబరం స్టేడియం స్టాండ్స్‌లో రిలాక్స్‌గా కూర్చొని.. ఆదివారం ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య మొదలైన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూశాడీ మాజీ క్రికెటర్. దాంతో.. యువకెరటం వైభవ్ సూర్యవంశీ ఆట చూసేందుకు వచ్చాడా? అని అభిమానులు అనుకుంటున్నారు.
సెప్టెంబర్‌తో ఆఖరు
బీసీసీఐ సమీక్ష సమావేశం అనంతరం ‘అగార్కర్ ఎందుకు పాల్గొనలేదు?’ అని మీడియా సెక్రటరీ దేవజిత్ సైకియాను చుట్టిముట్టింది. దాంతో.. ‘అగార్కర్ వేరే చోట ఉన్నారు. స్వల్వ వ్యవధిలోనే సమావేశాన్ని ఖరారు చేసినందున అతడు హాజరుకాలేదు. అజిత్ ఉన్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు కూడా లేనందున అతడు ఆన్లైన్లో కూడా మీటింగ్‌లో పాల్గొనలేదు. అతడిని కొనసాగించడం గురించి ఈరోజు చర్చించలేదు.
The BCCI believes that the growth of cricket must extend beyond its traditional territories, and we recognise our responsibility to contribute to that growth: Mr Devajit Saikia (@lonsaikia), Honorary Secretary, BCCI @CricketJapan pic.twitter.com/Fs1i4kkRT7
— BCCI (@BCCI) September 4, 2026
సెలెక్షన్ కమిటీ గురించిన చర్చే రాలేదు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు ప్రదర్శన గురించి, ఇటీవలే ముగిసిన శ్రీలంక టెస్టు సిరీస్ మీద మాత్రమే దృష్టి సారించాం. తదుపరి సిరీస్‌లు, ప్రపంచకప్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలి? అనే విషయాల గురించే మాట్లాడుకున్నాం’ అని సైకియా పేర్కొన్నాడు. 2023, జులై 4వ తేదీన చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ పదవీ కాలం ఈ సెప్టెంబర్‌లోనే ముగియనుంది. దాంతో.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకు అతడిని కొనసాగిస్తారా? కొత్తవాళ్లను నియమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Big names on the field, and a watchful eye in the stands! 👀
BCCI Chief Selector Ajit Agarkar is in Chennai for the #DuleepTrophy Final, closely following the action. 🏟️
Watch Day 2 of the #DuleepTrophy 2026 Final on September 7, from 9:30 AM, LIVE on Star Sports &… pic.twitter.com/89GaB23U4e
— Star Sports (@StarSportsIndia) September 6, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

