సిడ్నీ : మహిళల బిగ్‌బాష్ లీగ్ టైటిల్‌ను అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 10 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌పై గెలిచింది. తొలుత అడిలైడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేయగా, సమాధానంగా సిడ్నీ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌కు చెందిన దియోంద్ర డాటిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిడ్నీ సిక్సర్స్ ప్లేయర్ అష్లే గార్డ్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది.