Adam Zampa | ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు.. శ్రీలంక స్పిన్ దిగ్గజం సరసన జంపా
Adam Zampa : వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో ఈ మిస్టర లెగ్ స్పిన్నర్ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) రికార్డు సమం చేశాడు. 2007 ఎడిషన్‌లో ముత్తయ్య...
Adam Zampa : వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో ఈ మిస్టర లెగ్ స్పిన్నర్ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) రికార్డు సమం చేశాడు. 2007 ఎడిషన్‌లో ముత్తయ్య 4.14 ఎకానమీతో 23 వికెట్లు కూల్చగా.. జంపా 11 మ్యాచుల్లో 5.36 ఎకానమీతో 23 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్

భారత్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఫైనల్లో జంపా బుమ్రా(1) వికెట్ తీశాడు. దాంతో, మురళీధరన్ సరసన నిలిచాడు. అయితే.. ఒకే ఎడిషన్‌లో రెండో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ బ్రాడ్ హాగ్(2007), పాకిస్థాన్ లెజెండ్ షాహీద్ ఆఫ్రిది(2011) కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ ఆయా ఎడిషన్లలో 21 వికెట్లతో సత్తా చాటారు.
విదేశీ బౌలర్‌గా మరో రికార్డు
మరోవిషయం ఏంటంటే..? భారత గడ్డపై వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా జంపా మరో రికార్డు నెలకొల్పాడు. ఈ లెగ్ స్పిన్నర్ 27 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా చూస్తే 96 వన్డేల్లో జంపా 165 వికెట్లు పడగొట్టాడు. అందులో 11 నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం.
ఇవి కూడా చదవండి
-
Mlc Kavitha | మంథనికి వెయ్యి కోట్లు… సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నట్లే : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
-
Suresh Raina | నా జీవితంలో మర్చిపోలేని రోజదే.. వరల్డ్ కప్ ట్రోఫీ సంబురాల్ని గుర్తుచేసుకున్న రైనా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

