DC vs SRH : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్) శివాలెత్తిపోయాడు. వీరకొట్టుడు ఆటతోఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల భరతం పట్టిన ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్లో రెండో శతకంతో మెరిశాడు. ట్రావిస్ హెడ్(37) విఫలమైనా జోరు చూపిన అభిషేక్.. తన మార్క్ విధ్వసంతో చెడుగుడు ఆడుకున్నాడు. ఆఖర్లో క్లాసెన్(37 నాటౌట్) దంచేశాడు. ముకేశ్ కుమార్ వేసిన చివరి ఓవర్లో 4, 6, 4, 4 తో సన్‌రైజర్స్‌కు భారీ స్కోరందించాడు.
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్ : 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు) ఫామ్ కొనసాగిస్తూ భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా ఆడుతూ ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించిన ఈ విధ్వంసక బ్యాటర్ టాస్ ఓడిన హైదరాబాద్‌కు కొండంత స్కోరందించాడు. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్(37)తో కలిసి శుభారంభమిచ్చిన అభిషేక్.. 25 బంతుల్లో అర్ధ శతకం బాదేశాడు.
Incredible knock, iconic celebration 🙌
An Abhishek Sharma special lights up Hyderabad 💯
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/QUWtkWuX0D
— IndianPremierLeague (@IPL) April 21, 2026
పవర్ ప్లేలో దంచేసిన ఈ ద్వయం ఆ తర్వాత దూకుడు పెంచాలనుకుంది. కానీ, అక్షర్ పటేల్ ఓవర్లో హెడ్ ఔటవ్వగా.. 97 వద్ద తొలి వికెట్ పడింది. అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్(25)తో స్కోర్‌బోర్డును ఉరికించిన ఈ చిచ్చరపిడుగు నితీశ్ రానా ఓవర్లో రెండు సిక్సర్లతో ఐపీఎల్లో రెండో శతకం నమోదు చేశాడు. . సెంచరీ కొట్టేసి వెరైటీగా చేతులు కట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. జట్టు స్కోర్ 176 వద్ద ఇషాన్ ఔటైనా.. డెత్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ (37 నాటౌట్) ఉతికేశాడు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 4, 6, 4 ,4 తో ఇరవై రన్స్ పిండుకున్న క్లాసెన్ స్కోర్ 240 దాటించాడు. అభిషేక్ మెరుపులకు ఇషాన్, క్లాసెన్ దూకుడు తోడవ్వగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికే 242 రన్స్ కొట్టింది.
INNINGS BREAK!
A breathtaking century from Abhishek Sharma and late fireworks power #SRH to a massive 2️⃣4️⃣2️⃣! 💥
Can #DC pull off a monumental chase? 🤔
Scorecard ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC pic.twitter.com/cdaJi92pNB
— IndianPremierLeague (@IPL) April 21, 2026