DC vs SRH | అభిషేక్ బ్యాటుతో, మలింగ బంతితో.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హ్యాట్రిక్..!
DC vs SRH : సొంతగడ్డపై వరసగా మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడాఖా చూపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్) సుడిగాలి శతకంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మానసికంగా పైచేయి సాధిచిన హైదరాబాద్.. ఇషాన్ మలింగ(4-32) విజృంభణతో ఘన విజయం సాధించింది.
DC vs SRH : సొంతగడ్డపై వరసగా మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడాఖా చూపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్) సుడిగాలి శతకంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మానసికంగా పైచేయి సాధిచిన హైదరాబాద్.. ఇషాన్ మలింగ(4-32) విజృంభణతో ఘన విజయం సాధించింది. పవర్ హిట్టర్లతో నిండిన ఢిల్లీలో నితీశ్ రానా(57) అర్ధ శకతంతో పోరాడినా.. మిడిలార్డర్ మెరవలేదు. ఆఖర్లో హర్ష్ దూబే(3-12) తిప్పేయగా 195కే ఢిల్లీ ఫలితంగా పరిమితమవ్వగా.. ఇషాన్ సేన హ్యాట్రిక్ విజయం, ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది.
ఐపీఎల్-19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయంతో సొంత ప్రేక్షకులను అలరించింది. ఉప్పల్ స్టేడియంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (135 నాటౌట్) ఊచకోతతో భారీ స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్‌ను బౌలర్లు మళ్లీ నిలబెట్టారు. తొలి మ్యాచ్ ఆడుతున్న మధుషంక ఓపెనర్ పథుమ్ నిశాంక(8)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ, నితీశ్ రానా(57), కేఎల్ రాహుల్(37) దూకుడుగా ఆడి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. స్పిన్నర్లు, పేసర్లను దీటుగా ఎదుర్కొన్న రానా బౌండరీలతో భయపెట్టాడు.
Twin strikes from #SRH‘s man-in-form 🧡
Nitish Rana and David Miller fall to Eshan Malinga on 🔙 to 🔙 deliveries! ☝️☝️
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/kgmP8W7jTs
— IndianPremierLeague (@IPL) April 21, 2026
శివాంగ్ ఓవర్లో రెచ్చిపోయిన అతడు అర్ధ శతకంతో ఆశలు రేపినా. ఇషాన్ మలింగ(4-34) ఢిల్లీకి 11వ ఓవర్లో షాకిచ్చాడు. వరస బంతుల్లో రానాను, సూపర్ డెలివరీతో డేవిడ్ మిల్లర్(0)ను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. హ్యాట్రిక్ బంతికి వికెట్ కాపాడుకున్న ట్రిస్టన్ స్టబ్స్(27).. సమీర్ రిజ్వీ()తో.. అప్పటికే అవసరమైన నెట్ రన్‌రేటు 15 దాటింది. రివర్స్ స్కూప్ షాట్లు ఆడుతూ బౌండరీలు సాధిస్తున్న స్టబ్స్‌ను మలింగ బోల్తా కొట్టించాడు. దాంతో, ఐదో వికెట్‌కు 59 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. 18 బంతుల్లో 66 రన్స్ అవసరమవ్వగా.. మలింగ ఓవర్లో అనికేత్ క్యాచ్‌తో ఇంప్యాక్ట్ సబ్ అశుతోష్ శర్మ(14) పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ (2)సైతం విఫలమవ్వగా సన్‌రైజర్స్ 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
అభిషేక్ సునామీ
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్ : 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు) శివాలెత్తిపోయాడు. ఆరంభం నుంచి వీరకొట్టుడు ఆటతోఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల భరతం పట్టిన ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్లో రెండో శతకంతో మెరిశాడు. ట్రావిస్ హెడ్(37) విఫలమైనా జోరు చూపిన అభిషేక్.. తన మార్క్ విధ్వంసంతో చెడుగుడు ఆడుకున్నాడు.

ఆఖర్లో క్లాసెన్(37 నాటౌట్) దంచేశాడు. ముకేశ్ కుమార్ వేసిన చివరి ఓవర్లో 4, 6, 4, 4 తో సన్‌రైజర్స్‌కు భారీ స్కోరందించాడు. అభిషేక్ మెరుపులకు ఇషాన్, క్లాసెన్ దూకుడు తోడవ్వగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికే 242 రన్స్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

