Super Over | మహారాజా ట్రోఫీలో అరుదైన సన్నివేశం.. మూడో సూపర్ ఓవర్‌కు తేలిన ఫలితం
క్రికెట్లో మరీ ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల స్కోర్లు సమం అయినప్పుడు ఫలితాన్ని తేల్చే ‘సూపర్ ఓవర్' ఒక్కటి ఉంటేనే అభిమానులకు జబర్దస్త్ మజా ఉంటుందంటే అలాంటివి 3 ఉంటే ఇంకేమైనా ఉందా..! దానిని చూసినోళ్లంతా ‘సూపరో.. సూపరస్య.. సూపరోభ్య:’ అనాల్సిందే.
- సూపరో.. సూపరస్య.. సూపరోభ్య:
Super Over | బెంగళూరు: క్రికెట్లో మరీ ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల స్కోర్లు సమం అయినప్పుడు ఫలితాన్ని తేల్చే ‘సూపర్ ఓవర్’ ఒక్కటి ఉంటేనే అభిమానులకు జబర్దస్త్ మజా ఉంటుందంటే అలాంటివి 3 ఉంటే ఇంకేమైనా ఉందా..! దానిని చూసినోళ్లంతా ‘సూపరో.. సూపరస్య.. సూపరోభ్య:’ అనాల్సిందే. బెంగళూరు వేదికగా కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న మహారాజ ట్రోఫీలో భాగంగా హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.
మనీష్ పాండే సారథ్యంలోని హుబ్లీ 20 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అవగా బెంగళూరు సైతం 20 ఓవర్లకు సరిగ్గా 164 వద్దే ఆగిపోయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 10/1 స్కోరు చేయగా 11 పరుగుల ఛేదనలో హుబ్లీ కూడా 10/0 చేసింది. రెండో సూపర్ ఓవర్లో హుబ్లీ 8 రన్స్ చేస్తే బెంగళూరు 6 బంతుల్లో 8 పరుగులకే చేతులెత్తేసింది. ఇక మూడో సూపర్ ఓవర్లో బెంగళూరు 12/1 స్కోరు చేయగా హుబ్లీ(13)తరఫున మన్వంత్ కుమార్ రెండు ఫోర్లు బాదడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

