జడేజాకు ఇంగ్లిష్ రాదు.. నేను తిట్టినా అర్థం కాదు!

ముంబై: ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై సంజయ్ మంజ్రేకర్ చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఓ అభిమాని బయటపెట్టిన ట్విటర్ స్క్రీన్‌షాట్స్ దుమారం రేపుతున్నాయి. సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్.. తాను మంజ్రేకర్‌తో జరిపిన సంభాషణ గురించి బయటపెట్టాడు. అందులో జడేజాకు ఇంగ్లిష్ రాదని హేళన చేసినట్లు ఆ యూజర్ చెప్పాడు. తాను ఏం చెబుతున్నానో కూడా జడేజాకు అర్థం కాదని ఓ ట్వీట్లో మంజ్రేకర్ అన్నాడు.
నువ్వు చాలా దారుణంగా ఉన్నావు. మీలాగా ప్లేయర్స్‌ను నేను కూడా పొగడాలంటే ఎలా? నేను అభిమానిని కాను. ఓ విశ్లేషకుడిని. బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం ఏంటో జడేజాకు తెలియదు. ఎందుకంటే అతనికి ఇంగ్లిష్ రాదు అని సదరు అభిమానితో మంజ్రేకర్ అన్నాడు. జడేజా ఓ బిట్స్ అండ్ పీసెస్ (ఓ లక్ష్యం లేని) క్రికెటర్ అని 2019 వరల్డ్‌కప్ సందర్భంగా మంజ్రేకర్ విమర్శించాడు.
దీనికి జడేజా కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. మంజ్రేకర్‌కు అతిగా మాట్లాడే లక్షణం ఉన్నదని చెప్పేలా వర్బల్ డయేరియా అనే పదం వాడాడు.
ఆ తర్వాత కూడా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ చేసి బ్యాట్‌తోనూ సమాధానమిచ్చాడు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్ ఎక్కడ ఉందో తాను చూశాననీ జడ్డూ చెప్పాడు. అభిమాని చెబుతున్న ఈ వివాదాస్పద ట్వీట్లపై మంజ్రేకర్ ఇంకా ఏమీ స్పందించలేదు. ఈ మధ్యే అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ కాదని కామెంట్ చేసి మరోసారి విమర్శల పాలైన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

