Vaibhav Sooryavansh| ఐపీఎల్లో వైభవ్ తుఫాన్.. ఈసారి 36 బంతుల్లోనే సెంచరీ..!
Vaibhav Sooryavansh : అండర్-19 వరల్డ్‌కప్‌లో భారీ శతకంతో టీమిండియాను గెలిపించిన వైభవ్.. ఐపీఎల్లో రెండో శతకం బాదేశాడు. పంతొమ్మిదో సీజన్లో బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి తోపు బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 36 బంతుల్లో వంద కొట్టేశాడు.
Vaibhav Sooryavansh : భారత క్రికెట్లో శరవేగంగా దూసుకెళ్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆటకు రికార్డులు బద్ధలవుతున్నాయి. ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో భారీ శతకంతో టీమిండియాను గెలిపించిన వైభవ్.. ఐపీఎల్లో రెండో శతకం బాదేశాడు. పంతొమ్మిదో సీజన్లో బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి తోపు బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 36 బంతుల్లో వంద కొట్టేశాడు. జైపూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఐపీఎల్లో మూడో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.
జూనియర్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ స్టార్‌గా అవతరించాడు. నిరుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 35 బంతుల్లో సెంచరీతో చరిత్ర సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే వందతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో మూడో, రెండో వేగవంతమైన శతకాలు తన పేరిట రాసుకున్నాడీ బుడ్డోడు.
Ruthless with the bat, all heart with the celebration! 🫶
An outrageous 3️⃣6️⃣-ball HUNDRED from Vaibhav Sooryavanshi 👏
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @rajasthanroyals pic.twitter.com/P8Hu3eMFcG
— IndianPremierLeague (@IPL) April 25, 2026
తొలి ఓవర్ నుంచే
ప్రఫుల్ హింగే వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పూనకాలు వచ్చినట్టు నాలుగు సిక్సర్లతో తన ఉద్దేశం చాటిన వైభవ్.. 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాతా అదే జోరు కొనసాగించి మరో 21 బంతుల్లో సెంచరీ అందుకున్నాడీ హిట్టర్. షకీబ్ హుస్సేన్ ఓవర్లో 6, 4 ,6తో ఐపీఎల్లో రెండో శతకం తన పేరటి రాసుకున్నాడీ కుర్ర సంచలనం.
Not once. Not twice. THREE times 👀
Vaibhav Sooryavanshi hits another 15-ball half-century this season.👊🏻🔥#TATAIPL 2026 | #RRvSRH | LIVE NOW 👉https://t.co/HHSiOA288w pic.twitter.com/nY3fbmzXpe
— Star Sports (@StarSportsIndia) April 25, 2026
అతడి ఊపు చూస్తే క్రిస్ గేల్ రికార్డు (175 రన్స్) అధిగమిస్తాడా అనిపించింది. కానీ, సెంచరీ తర్వాతి బంతికే స్కూప్ షాట్ ఆడబోయి ఎల్బీగా ఔటయ్యాడు. వైభవ్ వికెట్ దక్కడంతో సన్‌రైజర్స్ బౌలర్లు హమ్మయ్య బతికిపోయాం అని ఊపిరి పీల్చుకున్నారు.
ఫాస్టెస్ట్ సెంచరీ వీళ్లదే..
1. క్రిస్ గేల్ (ఆర్సీబీ)- పుణేరి వారియర్స్‌పై 30 బంతుల్లో (2013లో)
2. వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్ రాయల్స్) – 35 బంతుల్లో, గుజరాత్ టైటాన్స్‌పై(2025లో)
3. వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్ రాయల్స్) – 36 బంతుల్లో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై(2026లో)
4. యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్ రాయల్స్) – 37 బంతుల్లో, ముంబై ఇండియన్స్‌పై(2010లో)
5. ప్రియాన్ష్ ఆర్య(పంజాబ్ కింగ్స్) – 38 బంతుల్లో, చెన్నై సూపర్ కింగ్స్‌పై(2025లో)
6. డేవిడ్ మిల్లర్ (కింగ్స్ లెవన్ పంజాబ్) – 38 బంతుల్లో, ఆర్సీబీపై(2013లో)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

