టీ 20 వరల్డ్ కప్ నుంచి అఫ్గానిస్థాన్ నిష్క్రమించడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు మొమహ్మద్ నబీ. అఫ్గానిస్థాన్ జట్టు సూపర్-12 చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు అఫ్గానిస్థాన్. పేలవమైన ప్రదర్శనతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. వరల్డ్ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ, ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం ట్విట్టర్ వేదికగా తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు నబీ. ‘ఏడాది కాలంగా మా ఆటతీరు సరిగా లేదు. ఏ కెప్టెన్ అయినా పెద్ద టోర్మెంట్ని కోరుకుంటాడు. గత కొన్ని టూర్లకు జట్టు ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీ, టీం మేనేజ్మెంట్, నేను ఒకే అభిప్రాయంతో లేము. ఆ ప్రభావం జుట్టు కూర్పు పైన పడింది. కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఆటగాడిగా కొనసాగుతాను’ అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు నబీ.
మిడిలార్డర్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్ అయిన నబీ 2010వ సంవత్సరంలో అఫ్గానిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటివరకూ 104 టీ 20 మ్యాచ్లు ఆడాడు.