Zoom: ప్రపంచవ్యాప్తంగా జూమ్ డౌన్.. ఆన్లైన్ క్లాస్‌లు, మీటింగ్‌లపై ప్రభావం
కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌కు మారాయి. ఈ కష్టకాలంలో చాలా దేశాలు ఈ ఆన్లైన్ క్లాస్‌ల కోసం జూమ్( Zoom ) అనే వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌పై ఆధారపడ్డాయి. అయితే ఇప్పుడీ జూమ్‌కు కనెక్ట్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వాషింగ్టన్: కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌కు మారాయి. ఈ కష్టకాలంలో చాలా దేశాలు ఈ ఆన్లైన్ క్లాస్‌ల కోసం జూమ్( Zoom ) అనే వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌పై ఆధారపడ్డాయి. అయితే ఇప్పుడీ జూమ్‌కు కనెక్ట్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు, వీడియో కాల్స్, వెబినార్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇంటర్నెట్లో ఔటేజ్‌లను ట్రాక్ చేసే వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ జూమ్ నెట్వర్క్ అసలు పని చేయలేదు.
అయితే వెంటనే స్పందించిన జూమ్.. ఆస్ట్రేలియాలో చాలా వరకూ ఈ సమస్యను పరిష్కరించగలిగింది. కానీ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా మంది జూమ్‌కు కనెక్ట్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పని చేస్తున్నామని, అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నామని జూమ్ ట్విటర్లో చెప్పింది. ఇండియాలో ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మీటింగ్ స్టార్టయినా కూడా చాలా మంది వెయిటింగ్ ఫర్ ద హోస్ట్ టు స్టార్ట్ ద మీటింగ్ అనే మెసేజ్ వస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- coivd-19
- zoom
- Zoom App
- Zoom Outage
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

