Sansad TV | హ్యాక్‌కు గురైన సంసద్ టీవీ.. యూట్యూబ్‌లోనూ చానెల్ టెర్మినేట్
సోమవారం అర్ధరాత్రి సంసద్ టీవీ చానెల్‌ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. దానికి ఇథీరియం అనే పేరు పెట్టారు. సంసద్ టీవీకి యూట్యూబ్
Sansad TV | సంసద్ టీవీ తెలుసు కదా. లోక్‌సభ, రాజ్యసభలో పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు సంసద్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. పార్లమెంట్ సమావేశాల ఫీడ్‌ను అందించే సంసద్ టీవీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో యూట్యూబ్ కూడా ఆ చానెల్‌ను యూట్యూబ్‌లో బ్లాక్ చేసింది. చానెల్ హ్యాక్‌కు గురవడంతో వెంటనే యూట్యూబ్ ఆ చానెల్‌ను యూట్యూబ్ నుంచి టెర్మినేట్ చేసేసింది. ప్రస్తుతం ఈ చానెల్ యూట్యూబ్‌లో అందుబాటులో లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశం నిర్వహించినా.. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించాలన్నా.. సంసద్ టీవీ ద్వారా ప్రసారాలను ప్రజలకు చేరవేస్తారు. అటువంటి చానెల్‌పై స్కామర్ల కన్ను పడింది అంటే.. స్కామర్లు ఎందుకు ఈ చానెల్‌ను హ్యాక్ చేశారో.. దాని వెనుక ఉన్న వాళ్ల ఉద్దేశం ఏంటో కనుక్కోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.
సోమవారం అర్ధరాత్రి సంసద్ టీవీ చానెల్‌ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. దానికి ఇథీరియం అనే పేరు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన సంసద్ చానెల్ సోషల్ మీడియా టీమ్.. చానెల్‌ను హ్యాకర్ల బారి నుంచి కాపాడగలిగింది. వెంటనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు సమాచారం అందించాం. ఈ విషయం తెలియడంతో యూట్యూబ్ వెంటనే చానెల్‌ను బ్లాక్ చేసింది.. అని సంసద్ టీవీ ప్రకటించింది.
యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందున సంసద్ టీవీని టెంపరరీగా బ్లాక్ చేశామని.. త్వరలోనే సెక్యూరిటీ త్రెట్స్ను ఫిక్స్ చేసి సంసద్ టీవీని తిరిగి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతామని యూట్యూబ్ కూడా వెల్లడించింది.
నిజానికి.. సంసద్ టీవీ యూట్యూబ్‌లో వెరిఫై చేసిన అకౌంట్. ఇదివరకు ఈ చానెల్ పేరు రాజ్యసభ టీవీగా ఉండేది. గత సంవత్సరమే దానికి సంసద్ టీవీ అని పేరు మార్చారు. లోక్‌సభ, రాజ్యసభ… రెండు సభల సమావేశాలను ప్రస్తుతం సంసద్ టీవీ ద్వారానే అందిస్తున్నారు. సంసద్ టీవీకి యూట్యూబ్‌లో 6.32 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

