YouTube | యూట్యూబ్‌లో షార్ట్స్ రాకుండా చేసుకోవాలా.. ఇలా చేయండి
YouTube : యూట్యూబ్‌లో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నవి షార్ట్ వీడియోలే. ఇవి కొందరికి ఉపయోగకరం. కానీ, వీటివల్ల చాలా మంది తమ టైం వేస్టు అవుతుందని భావిస్తున్న వాళ్లు ఉన్నారు.
YouTube : యూట్యూబ్‌లో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నవి షార్ట్ వీడియోలే. ఇవి కొందరికి ఉపయోగకరం. కానీ, వీటివల్ల చాలా మంది తమ టైం వేస్టు అవుతుందని భావిస్తున్న వాళ్లు ఉన్నారు. ఎందుకంటే ఒక షార్ట్ వీడియో చూడటం ప్రారంభిస్తే వరుసగా వీడియోలు చూస్తూనే ఉండిపోతున్నారు. అలాగని, యూట్యూబ్‌లో ఇవి రాకుండా ఉండే ఆప్షన్ ఇంతకుముందు లేదు.
యూట్యూబ్ ఓపెన్ చేస్తే షార్ట్స్ వచ్చి తీరుతున్నాయి. అయితే, ఇకపై వీటిని హైడ్ చేసుకునే వీలుంది. ఈ కొత్త అప్డేట్ను యూట్యూబ్ ఇప్పటికే కొందరు యూజర్లకు తీసుకొచ్చినట్లు సమాచారం. సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్పులు చేసుకుంటే ఇకపై షార్ట్స్ రావు. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇది. యూట్యూబ్ యాప్ లేదా వెబ్ పేజ్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత టైం మేనేజ్మెంట్ కనిపిస్తుంది. అనంతరం స్క్రోల్ టు డైలీ లిమిట్స్. ఇందులో షార్ట్స్ ఫీడ్ లిమిట్‌ను టర్న్ ఆన్ చేయాలి. తర్వాత ‘0 మినట్స్’పై క్లిక్ చేస్తే చాలు. మీ యూట్యూబ్‌లో షార్ట్స్ కనిపించవు.
హోం పేజీలో కూడా ఉండవు. అయితే, షార్ట్స్ పూర్తిగా పోవు. మీ సెర్చ్ ఫీడ్లోనో, రెకమండేషన్స్లోనో, ఛానల్స్లోనో కనిపిస్తాయి. అయినప్పటికీ కొత్తగా వచ్చిన ఫీచర్ అనవసరంగా షార్ట్స్ చూసే టైం తగ్గిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

