WhatsApp | వాట్సాప్‌లో కీలక మార్పులు చేసిన మెటా కంపెనీ..!
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజ్ దిగ్గజం వాట్సాప్ కీలక మార్పులు చేసింది. బ్యాగేజీ కలర్‌ను మార్చేసింది. వాట్సాప్ ఛానెల్, బిజినెస్ అకౌంట్ వెరిఫికేషన్ టిక్ కలర్ ఇప్పటి వరకు గ్రీన్‌లో ఉండగా.. దాన్ని బ్లూ కలర్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజ్ దిగ్గజం వాట్సాప్ కీలక మార్పులు చేసింది. బ్యాగేజీ కలర్‌ను మార్చేసింది. వాట్సాప్ ఛానెల్, బిజినెస్ అకౌంట్ వెరిఫికేషన్ టిక్ కలర్ ఇప్పటి వరకు గ్రీన్‌లో ఉండగా.. దాన్ని బ్లూ కలర్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో మెటా యాజమాన్యంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని అకౌంట్లకు సంబంధించిన వెరిఫికేషన్ టిక్ మార్క్ ఇక బ్లూ కలర్లోనే కనిపించనున్నాయి. వాట్సాప్ ట్రాకర్ వాబీటాఇన్ఫో సమాచారం అందించింది. ఇప్పటికే ఆండ్రాయిల్లో అందుబాటులో ఉన్నది. మెటా ఏఐ కోసం వాట్సాప్‌లో త్వరలోనే కంపెనీ బిగ్ అప్డేట్ను తీసుకురాబోతున్నది. ఆ తర్వాత మెటా ఏఐ వాయిస్ చాట్‌తో కూడా పని చేయనున్నది. వినియోగదారులు వాయిస్ ద్వారా మెటా ఏఐకి ప్రశ్నలు వస్తే.. టెక్ట్స్ రూపంలో సమాధానాలు ఇవ్వనున్నది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులందా నీరుగా యాప్‌లోనే యాక్సెస్ చేసుకునే వీలున్నది.
ఇదిలా ఉండగా.. వాట్సాప్ త్వరలోనే పలు ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేయబోతున్నది. ఇందులో ఏఆర్ వీడియో కాలింగ్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్, ఏఐ స్టూడియో, యూజర్ నేమ్స్, డబుల్ ట్యాప్ టు రియాక్ట్ ఫీచర్స్‌ను తీసుకురాబోతున్నది. ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) వీడియో కాలింగ్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఫీచర్ ద్వారా యూజర్లు వీడియో కాలింగ్ చేసే సమయంలో భిన్నమైన ఎక్స్‌పీరియెన్స్‌ను పొందే అవకాశం ఉంటుంది. వీడియో లుక్‌లో కరెక్షన్స్, ఫేషియల్ ఫిల్టర్స్ వాడుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్ సాయంతో వీడియో వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకునే వీలుంటుంది. ఇకపై మొబైల్ నంబర్‌తో పని లేకుండా యూజర్ నేమ్స్‌తో అకౌంట్‌ను క్రియేట్ చేసుకునేలా ఫీచర్స్ పరిచయం చేయనున్నది. అలాగే, ఏఐ స్టూడియో ఫీచర్‌పై పని చేస్తున్నది. మెటా ఏఐ ఛాట్ బాట్‌ను మరింత అప్డేట్ చేస్తూ వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఏఐ స్టూడియో ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు పర్సనలైజ్డ్ చాట్‌బాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ టు రియాక్ట్ ఇకపోతే ఇన్స్టాగ్రామ్ మాదిరిగా వాట్సాప్‌లో డబుల్ ట్యాప్ రియాక్షన్ ఫీచర్ తేనున్నది. వాట్సాప్ మెసేజ్‌పై రెండు సార్లు ట్యాప్ చేసి రియాక్షన్స్ తెలిపే వీలుంటుంది. డబుల్ ట్యాప్‌కు హార్ట్ సింబల్ డీఫాల్ట్ రియాక్షన్‌గా ఉండనుండగా.. యూజర్లు దాన్ని కస్టమైజ్ సైతం చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

