Whatsapp on Data backup | మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటా భద్రత కోసం చర్యలు చేపట్టింది. అందుకోసం ఎన్క్రిప్టెడ్ ఛాట్ బ్యాకప్ అనే ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ‘మేనేజ్ బ్యాకప్ సైజ్’ అనే మరో ఫీచర్ జత చేస్తున్నట్లు తెలిసింది. దీంతో యూజర్లు తమ చాట్ బ్యాకప్ సైజ్‌ను నిర్ణయించుకునే చాన్స్ ఉంటుందని సమాచారం.
వాట్సాప్ ఛాట్ బ్యాకప్ సైజ్ పరిమితికి మించకుండా ముఖ్యమైన డేటా మాత్రమే స్టోర్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ని త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తెస్తామన్నది.
త్వరలో గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ బ్యాకప్ సైజ్‌పై పరిమితులు విధించనున్నది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మేనేజ్ బ్యాకప్ సైజ్ ఫీచర్ అందుబాటులోకి తేవడం గమనార్హం. ప్రస్తుతం వాట్సాప్ బ్యాకప్‌లో యూజర్స్ వీడియోలతో పాటు అన్ని రకాల ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు.
దానివల్ల వాట్సాప్ స్టోరేజ్ నిండాక.. మిగతా డేటా క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. గూగుల్ ఫొటోస్ తరహాలో డ్రైవ్ స్టోరేజ్పైనా పరిమితులు విధించనుందనే వార్తల నేపథ్యంలో మేసేజ్ బ్యాకప్ సైజ్ ఫీచర్‌ను తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్స్ పరిమితికి మించి డేటాని స్టోర్ చేసుకునే అవకాశం ఉండదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.