ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్లను పూర్తిగా డిలీట్ చేసేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ తీసుకొచ్చిన ఈ కంపెనీ.. దీనికి కాల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరిమితిని పెంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత కూడా దాన్ని పర్మినెంట్గా డిలీట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి వినియోగదారులు తాము పంపిన మెసేజ్లను 2 రోజుల 12 గంటల వరకు డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ పరిమితి కేవలం 68 నిమిషాలుగానే ఉండేది.
💭 Rethinking your message? Now you’ll have a little over 2 days to delete your messages from your chats after you hit send.
— WhatsApp (@WhatsApp) August 8, 2022