Vivo Y31 5G | బడ్జెట్ ధరలకే రెండు సరికొత్త 5జి ఫోన్లను లాంచ్ చేసిన వివో.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
మొబైల్స్ తయారీ సంస్థ వివో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలకే విడుదల చేసింది. వివో వై31 5జి, వై31 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
Vivo Y31 5G | మొబైల్స్ తయారీ సంస్థ వివో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలకే విడుదల చేసింది. వివో వై31 5జి, వై31 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వివో వై31 5జి స్మార్ట్ ఫోన్లో 6.68 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్‌కు గాను గార్డియన్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. కనుక ఫోన్ చాలా క్వాలిటీగా, దృఢంగా ఉంటుంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది.4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు.
వివో వై31 5జి ఫీచర్లు..
వివో వై31 5జి ఫోన్లో మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కనుక ఫోన్ చాలా దృఢంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఐపీ 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్లో యూఎస్బీ టైప్ సి ఆడియోకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ సదుపాయం కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం అందిస్తున్నారు. 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఈ ఫోన్లో అందిస్తున్నారు. దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. కనుక ఫోన్ ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
వై31 ప్రొ 5జి ఫోన్లో..
వివో వై31 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్లో 6.72 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్బుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ ఉంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 50, 2 మెగాపిక్సల్ కెమెరాలను రెండింటిని ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. దీనికి ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సదుపాయం ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. 6500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండగా, దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ధర వివరాలు..
వివో వై31 5జి స్మార్ట్ ఫోన్‌ను డైమండ్ గ్రీన్, రోజ్ రెడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,499గా ఉంది. అలాగే వై 31 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌ను మోకా బ్రౌన్, డ్రీమీ వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్లను అమెజాన్, వివో ఇండియా ఆన్ లైన్ స్టోర్, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఇప్పటికే విక్రయిస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్లపై పలు ఆఫర్లను సైతం పొందవచ్చు. వై31 5జి ఫోన్‌పై రూ.1000, వై 31 ప్రొ 5జి ఫోన్‌పై రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లపై 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- smart phones
- Vivo
- vivo y31 5g
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

