Vivo T4R | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
వివో సంస్థ భారత్‌లో లేటెస్ట్గా టి4ఆర్ పేరిట ఓ నూతన మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
Vivo T4R | వివో సంస్థ భారత్‌లో లేటెస్ట్గా టి4ఆర్ పేరిట ఓ నూతన మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే ఉండగా, దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించే విధంగా 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. మరో 12జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక, ముందు ఉన్న కెమెరాలతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్‌కు ఐపీ68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో 5700 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని సైతం ఏర్పాటు చేశారు. దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
మిలిటరీ గ్రేడ్ నాణ్యత..
ఈ ఫోన్ డిస్ప్లేకు ప్రత్యేకమైన షాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కింద పడ్డా అంత సులభంగా పగలదు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ఆడియో కూడా ఉంది. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కనుక క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. 5జి సేవలను ఈ ఫోన్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.
ధర వివరాలు..
వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్‌ను ఆర్కిటిక్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,499 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,499గా ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.23,499 ధరకు అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆగస్టు 5 నుంచి విక్రయించనున్నారు. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌పై రూ.2వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరో రూ.2వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తున్నారు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- smart phones
- Vivo
- vivo t4r
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

