vivo T4 Lite 5G | అత్యంత తక్కువ ధరకే భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ ఫోన్..!
అత్యంత తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే వివో నూతనంగా ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు అధికంగా ఉండడమే కాదు, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
vivo T4 Lite 5G | అత్యంత తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే వివో నూతనంగా ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు అధికంగా ఉండడమే కాదు, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వివో సంస్థ టి4 లైట్ 5జి పేరిట ఓ నూతన బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 ఇంచుల ఎల్సీడీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఉండగా, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 2 ఏళ్ల వరకు ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. సూర్యకాంతిలోనూ ఫోన్ తెర స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్‌కు 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఇందులో స్టోరేజ్‌ను మెమొరీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
మిలిటరీ గ్రేడ్ నాణ్యత..
డ్యుయల్ సిమ్‌లతోపాటు ఒక మైక్రో ఎస్డీ కార్డును వేసుకునే విధంగా మొత్తం 3 స్లాట్లను ఈ ఫోన్లో ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఐపీ 64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ బాగుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్లో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫైని అందిస్తున్నారు. బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ధర వివరాలు..
వివో టి4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.12,999 ధరకు అందిస్తున్నారు. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ జూలై 2వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌పై లాంచింగ్ కింద ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

